నేడు బాసరకు ఇన్చార్జి మంత్రి సీతక్క రాక
మనోరంజని : ( ప్రతినిధి )
బాసర : డిసెంబర్ 12
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన బాసరకు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ- మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క- టిపిసిసి జనరల్ సెక్రెటరీ సత్తుపల్లి మల్లేష్ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశానికి సమావేశానికి ప్రజా ప్రతినిధులు- నాయకులు-కార్యకర్తలు హాజరుకావాలని కోరారు