ఆహారం కోసం కోతుల వలసలు

డస్ట్ బిన్ దగ్గర ఆహారం కోసం తిప్పలు చేస్తున్న కోతులు
  1. ఆహారం కోసం గ్రామాలు, పట్టణాల్లోకి వలస వెళ్తున్న కోతులు.
  2. సారంగాపూర్ మండలంలో బస్టాండ్ వద్ద కోతుల తిప్పలు.
  3. డస్ట్ బిన్ లో ఉన్న ఆహారాన్ని కోస్తూ చెత్త చెల్లాచెదురుగా విసురుతున్నాయి.
  4. పరిసర ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటాలని ప్రజల సూచన.

డస్ట్ బిన్ దగ్గర ఆహారం కోసం తిప్పలు చేస్తున్న కోతులు

ఆహారం కోసం అడవులను విడిచిన కోతులు గ్రామాలు, పట్టణాల్లోకి వలస వెళ్తున్నాయి. సారంగాపూర్ బస్టాండ్ వద్ద కోతులు డస్ట్ బిన్ లో ఆహారం కోసం ప్లేట్లు కోస్తూ చెత్తను చెల్లాచెదురుగా విసురుతున్నాయి. వీటివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనావాసాలకు రాకుండా అడవుల్లో పండ్ల మొక్కలు నాటాలని స్థానికులు సూచిస్తున్నారు.

సారంగాపూర్, డిసెంబర్ 9:
అడవుల్లో ఆహార వనరులు తగ్గిపోవడం వల్ల కోతులు గ్రామాలు, పట్టణాల్లోకి వలస వెళ్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కోతుల తిప్పలు స్పష్టమయ్యాయి.

డస్ట్ బిన్‌లో తిని పారేసిన టిఫిన్ ప్లేట్లు, చెత్తలో ఆహారం కోసం కోతులు కోస్తూ చెల్లాచెదురుగా విసరడంతో పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. ఇవి పిల్లలకు భయభ్రాంతులను కలిగించడం మాత్రమే కాకుండా, ఇళ్లకు కూడా నష్టం చేస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల సూచన: కోతుల వలస తగ్గించడానికి అడవుల్లో పండ్ల మొక్కలు నాటాలి. జనావాసాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని, కోతుల మానసికభయాలను నివారించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment