షేక్‌పేటలో మాగంటి సునీత గెలుపు కోసం మెండోరా టీఆర్ఎస్ నేతల జోరు ప్రచారం
మాజీ ఎంపీటీసీ బాబా ఆధ్వర్యంలో యువ నాయకులు – గ్రామ స్థాయిలో జోరుగా ప్రచారం
మెండోరా ప్రతినిధి, అక్టోబర్ 29 (మనోరంజని తెలుగు దినపత్రిక):
ఎన్నికల సందర్బంగా షేక్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం మెండోర మండల టీఆర్ఎస్ నాయకులు పటిష్టంగా కృషి చేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ బాబా ఆధ్వర్యంలో బుస్సాపూర్ గ్రామానికి చెందిన సురేష్, పోచంపాడు గ్రామ టీఆర్ఎస్ అభిమానులు భాస్కర్ తదితరులు జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా యువత శక్తిని ఏకతాటిపైకి తెచ్చి ప్రజలతో కలిసిమెలిసి పార్టీ అభ్యర్థి అభివృద్ధి పథకాలను వివరిస్తున్నారు. స్థానిక ఓటర్ల మద్దతు టీఆర్ఎస్ అభ్యర్థికి లభించేలా తాము కృషి చేస్తామని నాయకులు తెలిపారు.