చివరి యాత్రలో తోడైన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు
మనోరంజని ప్రతినిధి, జమ్మలమడుగు – సెప్టెంబర్ 29
జమ్మలమడుగు నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్న పళ్ళ సుబ్బలక్షుమ్మ అనే మహిళ మరణించగా, అంతిమ సంస్కరణలకు బంధువులు ఎవరు రాకపోవడంతో స్థానికులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌ను సంప్రదించారు. సమాచారం అందుకున్న ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి సోమవారం ఉదయం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కరణలు నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు, సురేష్, ప్రసన్న మరియు ఇతరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా ఫౌండేషన్ సభ్యులు కోరుతున్నారు:
📞 82972 53484
📞 91822 44150