బంధువులు లేకపోయినా బంధువుల్లా అంత్యక్రియలు చేసిన “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులు
మనోరంజని తెలుగు టైమ్స్ – ప్రొద్దుటూరు | అక్టోబర్ 5, 2025
ప్రొద్దుటూరులో మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘనమైన సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి నీటిలో పడి మృతి చెందగా, ఐదు రోజులుగా బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” సభ్యులను సంప్రదించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబహాన్ నేతృత్వంలో సభ్యులు స్పందించి, ఆదివారం సాయంత్రం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిషెట్టి వెంకటాలక్ష్మి, సుమన్ బాబు, ప్రసన్న కుమార్, మైఖేల్ బాబు మరియు ఇతరులు పాల్గొన్నారు.
సామాజిక సేవలో భాగంగా మానవతా విలువలను నిలబెట్టిన ఈ కార్యక్రమం ప్రజల ప్రశంసలు పొందుతోంది.
మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు సంప్రదించవలసిన నంబర్లు:
📞 82972 53484, 91822 44150