ఎమ్మెల్యే ను కలిసిన ఇలేగాం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు
సిరాల ప్రాజెక్టు పూర్తి కావడంతో ఇలేగాం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ధన్యవాదాలు తెలిపి, శాలువాతో సత్కరించారు. 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి, ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయించడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని హ ర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంటకు పైగా ఎమ్మెల్యేతో గ్రామ సమస్యలపై చర్చ జరిగింది. పొలాలకు వెళ్లే రోడ్ల నిర్మాణం ఎలా చేపట్టాలో రైతులకు దిశ నిర్దేశం చేశారు. రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని కలసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. హనుమాన్ మందిర నిర్మాణం పూర్తి కావడంతో బిల్లులు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరగా, వారం రోజుల్లో హైదరాబాద్ వెళ్లి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారి లేకపోవడంతో బిల్లులో జాప్యంజరిగిందన్నారు. కొత్తచెరువుకు 25 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని, రెండు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అదేవిధంగా ఇలేగాం రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దశ లవారీగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరారు
ఎమ్మెల్యే ను కలిసిన ఇలేగాం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు
Published On: July 29, 2025 7:35 pm
