నిర్మల్ జిల్లా : అక్టోబర్ 23
సారంగాపూర్: మండలంలోని వివిధ గ్రామాల ఆలయాల బాధ్యులతో బుధవారం ఎస్సై శ్రీకాంత్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు..ఉన్నత అధికారుల ఆదేశానుసారం
ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే 24 గంటలపాటు వాచ్ మెన్ ను ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.అత్యవసరం అవుతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ అడెల్లి మహా పోచమ్మ ఆలయం, స్వర్ణ లోని కోదండ రామాలయం, జామ్ గ్రామంలోని శ్రీ పట్టాభి సీతా రామ ఆలయం, వంజర్ లోని శ్రీ మహా లక్ష్మీ ఆలయాల భాధ్యులు పాల్గొన్నారు