పంచాయతీ ఎన్నికలపై నాయకులతో సమావేశం
మనోరంజని ప్రతినిధి
ముధోల్ : ఫిబ్రవరి 05
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల నాయకులు గ్రామస్తులతో బుధవారం మండల కేంద్రమైన ముధోల్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో గల ఓటర్ లిస్టు పై అవగాహన కల్పించారు. గ్రామాల్లోని ఓటర్లు ఓటు వేసేందుకు ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలు- వార్డుల వారీగా పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల రంగారెడ్డి, నజీమ్, తదితరులు పాల్గొన్నారు