సారంగాపూర్ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం

సారంగాపూర్ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం

సారంగాపూర్ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం

మనోరంజని ప్రతినిధి, సారంగాపూర్ – సెప్టెంబర్ 27

సారంగాపూర్ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కే. శంకర్ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించేందుకు పిటిఎం చాలా ఉపయోగకరమని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థుల అభ్యాసం, క్రమశిక్షణ, భవిష్యత్ ప్రణాళికలపై తల్లిదండ్రులకు వివరాలు అందించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment