త్వరలో తెలంగాణలో మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర
తెలంగాణ AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై, ప్రతి నియోజకవర్గంలో 8-10 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తూ వారం రోజుల పాటు సాగే పాదయాత్ర షెడ్యూల్ ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, పార్టీలో కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయాన్ని కల్పించడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే దిశగా పాదయాత్ర సాగనుంది