జె డి ఆర్ ఎఫ్ ప్రాంతీయ కార్యదర్శిగా మేడూరి రాజేంద్రప్రసాద్

జె డి ఆర్ ఎఫ్ ప్రాంతీయ కార్యదర్శిగా మేడూరి రాజేంద్రప్రసాద్

జర్నలిస్ట్స్ డెమొక్రటిక్ రైట్స్ ఫోరం ఉమ్మడి గుంటూరు జిల్లా రీజినల్ సెక్రటరీగా సీనియర్ జర్నలిస్ట్ మేడూరి రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు.

గత నాలుగు దశాబ్దాలుగా ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా, ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా ఉన్న రాజేంద్రప్రసాద్ విలువలతో కూడిన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు, గాడిలో పెట్టేందుకు పాత్రికేయ వృత్తి ప్రధాన భూమిక పోషిస్తున్నదన్నారు. తనను గుర్తించి ప్రాంతీయ కార్యదర్శిగా నియమించిన అధ్యక్షులు పూలతోటి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాసరావు, ఫోరం గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఐలా వెంకటేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. వృత్తిపరంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుండి రావలసిన కనీస హక్కులు, సౌకర్యాలపై జెడిఆర్ఎఫ్ ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతుందని తెలిపారు. పాత్రికేయ వృత్తిలో విలువలతోపాటు సమస్త మానవాళి అభ్యుదయమే జెడిఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యాలనన్నారు. నిజాయితీ, నిబద్ధతతో కూడిన పాత్రికేయ సంఘం జెడిఆర్ఎఫ్ ద్వారా రాణించాలనుకునే వివిధ పత్రికలలు, టీవీ చానల్స్, సోషల్ మీడియా లలో పని చేసే రిపోర్టర్లకు, వీడియో జర్నలిస్టులకు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టులకు జేడిఆర్ఎఫ్ ఆహ్వానం పలుకుతున్నదని చెప్పారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో విలువలతో కూడిన పాత్రికేయ వృత్తిని బలోపేతం చేయాలనుకునే అన్ని దిన పత్రికలలో పనిచేసే విలేకరులు, స్ట్రింగర్లు ఫోన్ నెంబర్ 9393912663 కు సంప్రదించాలని జెడిఆర్ఎఫ్ ప్రాంతీయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment