మద్దికల్ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
భీమారం మండలం, మద్దికల్, నేరేడుపల్లి లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 56 మందికి అవసరమైన మందులను పంపిణీ చేశారు, 4 నుండి రక్త నమూనాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. వర్షాకాలంలో నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గణేష్, ఏఎన్ఎం ఎ. సుజాత, ఎం ఎల్ హెచ్ పి మానస, ఆశా వర్కర్ వెంకటమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు