*చిల్లి చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకాలు!*
హైదరాబాద్:జులై 28*
కొందరికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు వారంలో ప్రతిరోజు పెట్టిన చికెన్ తింటుంటారు. చికెన్ తో తయారు చేసే వివిధ వెరైటీలను ఇండ్లలోను రెస్టారెంట్లో తింటూనే ఉంటాం, చికెన్ వంటకాలు అంటే పడి చచ్చే వారికి నిజంగానే ఇది షాకింగ్ న్యూస్..
ఎందుకంటే చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్నారు కొందరు రెస్టారెంట్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చికెన్ కు బదులు గబ్బిలాల మాంసాన్ని పంపుతున్నారని తెలిసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది, గబ్బిలాలను వేటాడి చికెన్ అని చెప్పి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలిసిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని డానిష్ పేట పరిధిలోని తోప్పూర్ రామస్వామి కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని డానిష్ పేట అటవీ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్‌కుమార్ నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు.. నిజంగానే అక్కడ తుపాకీ కాల్పుల శబ్దాలు వారికి వినిపించాయి.
దీంతో ఏంటని వారు అటవీ ప్రాంతాన్ని మొత్తం గాలించారు. ఈ క్రమంలోనే వారికి కమల్, సెల్వం అనే ఇద్దరు వ్యక్తులు కన్పించా రు. వెంటనే అటవీ శాఖ అధికారులు వారి ఇద్దరిని పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించగా.. వారు ఎలాంటి విషయాలు చెప్పలేదు. కాకపోతే వారిద్దరూ ఓ హోటల్ నిర్వహిస్తూ చికెన్ అమ్ముతున్నారు.
దీంతో వారు గబ్బిలాల మాంసంతోనే చికెన్ చేస్తు న్నట్లు అనుమానించిన స్థానికులు అదే నిజమై ఉంటుందని పోలీసులకు చెప్పారు. ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
అయితే ప్రస్తుతం వారు నోరు మెదపడం లేదని.. తాము ఎలాంటి తప్పు చేయడం లేదని మాత్రమే చెబుతున్నారని పోలీసులు వివరించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ఓమలూరు సమీపంలోని పన్నపట్టి పంచాయతీలోని వవ్వాల్‌తోప్పు ప్రాంతంలో ఒక చెట్టుపై లక్షలాది గబ్బి లాలు నివసిస్తున్నాయని.. వాటిని వేటాడటానికి కూడా వీరిద్దరూ ప్రయత్నించినట్లు ఆ గ్రామస్థులు చెబుతున్నారు.