వృద్ధురాలికి అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

May I Help You Foundation funeral assistance
  • చదుల్ల రామనాయకమ్మ (90) అనారోగ్యంతో మరణం.
  • మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ హిందూ సంప్రదానం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది.
  • దాతలకు ఫౌండేషన్ కృతజ్ఞతలు.

 

జమ్మలమడుగు మండలంలోని చదుల్ల రామనాయకమ్మ (90) అనారోగ్యంతో మరణించగా, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ముందుకు రాలేదు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఛైర్మన్ మోరే లక్ష్మణ్ రావు వెంటనే స్పందించి, హిందూ సంప్రదానం ప్రకారం అంతిమ సంస్కరణలు నిర్వహించారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

జమ్మలమడుగు మండలంలో నివాసమున్న 90 సంవత్సరాల వృద్ధురాలు చదుల్ల రామనాయకమ్మ అనారోగ్యంతో మరణించినప్పుడు, ఆమె అంతిమ సంస్కరణలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఛైర్మన్ మోరే లక్ష్మణ్ రావు వెంటనే స్పందించి, గురువారం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదానం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహన్, అహమద్ హుస్సేన్, కృపా అగ్ని షరూన్ ట్రస్ట్ సభ్యులు పాపిశేట్టి వెంకటాలక్షుమ్మ, సుమన్ బాబు, సురేష్, శ్రీరామ్ మరియు ఇతరులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన దాతలు ఈ నెంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు: +91 82972 53484, +91 9182244150.

Join WhatsApp

Join Now

Leave a Comment