మాత రమాబాయి అంబేద్కర్ మహిళలకు ఆదర్శప్రాయురాలు – ఎమ్మెల్యే రామారావు

రమాబాయ్_అంబేద్కర్_జయంతి_వేడుకలు_ముధోల్
  • ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ రమాబాయ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు
  • అంబేద్కర్ ఆశయ సాధనలో రమాబాయ్ కృషి అమోఘం అని ప్రశంస
  • నాక్షన్ నగర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు

రమాబాయ్_అంబేద్కర్_జయంతి_వేడుకలు_ముధోల్

ముధోల్ నాగ్షన్ నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఈ వేడుకల్లో పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. రమాబాయ్ అంబేద్కర్ ప్రతి మహిళకు ఆదర్శమూర్తి అని కొనియాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

 

నిర్మల్ జిల్లా ముధోల్  మండల కేంద్రంలోని నాగ్షన్ నగర్లో శుక్రవారం భీమ్ సేన యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని, రమాబాయ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనలో రమాబాయ్ అంబేద్కర్ యొక్క సహకారం మరువలేనిదని తెలిపారు. మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచారని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆమె చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

జయంతి సందర్భంగా నాగ్షన్ నగర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, ఈ వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు భోజనం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బౌద్ధ మహాసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భీమ్ సేన యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment