గ్రామదేవత సన్నిధిలో సామూహిక కుంకుమార్చన

గ్రామదేవత సన్నిధిలో సామూహిక కుంకుమార్చన

ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26

గ్రామదేవత సన్నిధిలో సామూహిక కుంకుమార్చన

మండల కేంద్రమైన ముధోల్ లోని గ్రామ దేవత అయిన ముక్తా దేవి అమ్మవారూ, ధనగర్ గల్లీలోని పోచమ్మ అమ్మవారి సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు పాల్గొనడానికి మంగళ హారతులతో తరలివచ్చారు. వేద పండితులు ప్రణీత్ మహారాజ్ శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని పేర్కొన్నారు. సామూహిక కుంకుమార్చన పూజలతో అమ్మవారి ఆలయానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది

Join WhatsApp

Join Now

Leave a Comment