ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం
ఆంధ్రప్రదేశ్ : విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఊడికలపేట గ్రామంలో ఓ ఇంటి ముందు మనిషి పుర్రెకు పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాల ప్రకారం, వ్యవసాయ కూలీ పొంతపల్లి పైడమ్మ ఇంటి గుమ్మం వద్ద సోమవారం తెల్లవారుజామున పసుపు, కుంకుమతో పూజ చేసిన పుర్రెను గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి, ఫొటోలు తీసి పుర్రెను శ్మశానంలో పాతిపెట్టారు