బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మనోహర్ రెడ్డి మద్దతు

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మనోహర్ రెడ్డి మద్దతు

మనోరంజని తెలుగు టైమ్స్ — ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 3

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు మాజీ జడ్పిటిసి ల ఫోరం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి పేట జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మద్దతు తెలిపారు. మండల పరిధిలోని 27 గ్రామ పంచాయతీలలో 3 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 24 పంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు . చేయలేదని pacs మరియు ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సన్నం వడ్లకు బోనస్‌గా 6 వేల క్వింటాల ధాన్యం రూపాయల 30 లక్షలు విడుదల చేయలేదని నిర్లక్ష్యం చేశారన్నారు.అకాల వర్షాల వల్ల మూడు వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినా, రైతులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో యాబై శాతం రైతు ల కు మాత్రమే మాఫీ జరిగి, మిగతా అర్హులైన రైతులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించి, అత్యధికంగా తమ అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment