-
- మంగాయి టీమ్, కార్యకర్తలకు మంగాయి సందీప్ రావు ధన్యవాదాలు
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై విశ్వాసం
- 8 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ విజయవంతం చేసిన గ్రాడ్యుయేట్స్, ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు
-
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ప్రసన్న హరికృష్ణ గెలుపే లక్ష్యంగా కృషి చేసిన మంగాయి టీమ్, కార్యకర్తలకు మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముధోల్ నియోజకవర్గ పరిధిలోని 8 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించి ఎన్నిక విజయవంతం చేసిన గ్రాడ్యుయేట్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డా. ప్రసన్న హరికృష్ణ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన మంగాయి టీమ్, కార్యకర్తలకు మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు ధన్యవాదాలు తెలియజేశారు. ఫిబ్రవరి 27న ముధోల్ లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ విజయవంతం కావడంలో ముధోల్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు కృషి చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ పరిధిలోని 8 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించిన గ్రాడ్యుయేట్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, యువత సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంగాయి టీమ్ సభ్యులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.