వానల్పాడ్ ప్రభుత్వ జెడ్పిహెచ్ పాఠశాలకు మంగాయి సందీప్ రావు చేయూత

Alt Name: వానల్పాడ్ పాఠశాల

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

Alt Name: వానల్పాడ్ పాఠశాల

భైంసా: సెప్టెంబర్ 25

నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా నీటి సమస్య ఏర్పడింది. పాఠశాల ఆవరణలో ఉన్న బోర్వెల్‌లో విద్యుత్ మోటారు పూర్తిగా చెడిపోయి, విద్యార్థులు తాగునీటి మరియు ఇతర అవసరాల కొరకు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

 

ఈ విషయం వానల్పాడ్ గ్రామ మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి ద్వారా మంగాయి సందీప్ రావు గారి దృష్టికి వెళ్లింది. వారు వెంటనే స్పందించి, పాఠశాల అవసరమైన విద్యుత్ మోటార్‌ను రూ. 11,000/- ఖర్చుతో కొనివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ZPHS వానల్పాడ్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు ముత్యం రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు దాత మంగాయి సందీప్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment