ముధోల్‌లో నూతన సర్పంచ్‌లకు మంగాయి సందీప్‌రావు ఫౌండేషన్ సన్మానం

ముధోల్‌లో నూతన సర్పంచ్‌లకు మంగాయి సందీప్‌రావు ఫౌండేషన్ సన్మానం

ముధోల్, డిసెంబర్ 24 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
ముధోల్‌లో నూతన సర్పంచ్‌లకు మంగాయి సందీప్‌రావు ఫౌండేషన్ సన్మానం

ముధోల్ నియోజకవర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచ్‌లను మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్‌రావు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు, ఆయన సతీమణి హైకోర్టు న్యాయవాది సింధూజ (B.Sc Agriculture, B.A. LLB, M.A. Political Science) కూడా పాల్గొన్నారు.
నూతన సర్పంచ్‌లను శాలువాలతో సన్మానించి, ప్రజా సేవలో అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రత్యేకంగా మహిళా సర్పంచ్‌లను అభినందించిన సింధూజ గారు మాట్లాడుతూ —”మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి. సమానత్వం, సేవా దృక్పథం, పారదర్శకతతో గ్రామ పాలన సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని అన్నారు. మంగాయి సందీప్‌రావు మాట్లాడుతూ —”సమాజం నమ్మిన ప్రతినిధులుగా సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రతి గ్రామం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగేందుకు కృషి చేయాలి” అని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment