ఉత్తమ ఉపాధ్యాయురాలికి మండల విద్యాధికారి సన్మానం
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 25
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, కౌట్ల బి గ్రామంలోని నేతాజీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయురాలు మంచాల కృపారాణి ఉత్తమ ఉపాధ్యాయురాలు ఇటీవల జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అవార్డును అందుకున్నారు. శనివారం పాఠశాల యాజమాన్యం తరపున మండల విద్యాధికారి మహేందర్ , అవార్డు గ్రహీతరాలిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల పురోభివృద్ధికి మార్గదర్శిలుగా నిలుస్తారని, విద్య జీవన మనుగడకు అత్యంత విలువైన సంపద అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగుంట గంగాధర్, వ్యవస్థాపకులు ఐర రామ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ చవాన్ ప్రకాష్, జడ్పిహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ నారాయణరెడ్డి, అశోక్, నేతాజీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.