మానవసేవయే మాధవసేవ
వయోవృద్ధులు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ చేసిన మహిళా జర్నలిస్ట్ గీత
హైదరాబాద్, (జూబ్లీహిల్స్): మనోరంజని తెలుగు టైమ్స్
సీజనల్‌గా వచ్చే చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం, పీజేఆర్ టెంపుల్ ప్రాంతాల్లో వయోవృద్ధులు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళా జర్నలిస్ట్ గీత ఆధ్వర్యంలో, శ్రేష్ట ఫౌండేషన్ సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ గీత మాట్లాడుతూ… రోడ్లపై నివసిస్తున్న వయోవృద్ధులు, వికలాంగులు ఎముకలు కొరికే చలితో ఇబ్బంది పడకుండా దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంకా ఎక్కడైనా చలితో బాధపడుతున్న వయోవృద్ధులు ఉన్నట్లయితే తనను సంప్రదించాలని, తక్షణమే అవసరమైన సహాయం అందిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన శ్రేష్ట ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మానవసేవే నిజమైన మాధవసేవ అనే భావనతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా జర్నలిస్ట్ గీత టీమ్ సభ్యులు, శ్రేష్ట ఫౌండేషన్ సీఈఓ కంకణాల ఎప్రిఇము తదితరులు పాల్గొన్నారు.