18న జరిగే రైతు సదస్సును విజయవంతం చేయండి

Alt Name: రైతు సదస్సు లో వెంకటేష్ మోహనం

నిజామాబాద్: ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
అక్టోబర్ 11:

వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు వాటి అభివృద్ధి అంశంపై అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నీలం రామచంద్రయ్య భవన్ లో రైతు సదస్సు నిర్వహిస్తున్నామని AIKMS జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య తెలిపారు.

ఈ సందర్భంగా, జిల్లా కేంద్రంలో ఎన్ ఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, వేల్పూరు భూమయ్య మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి పడుతుందని అన్నారు.

అతను చెప్పినదాని ప్రకారం, వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న నిధులు అరకొరగా ఉన్నాయని, పుట్టెడు కష్టాలతో అప్పులు సైతం చేసి పంటలు పండిస్తున్న రైతులకు కనీసం మద్దతు ధరలు రావడంలేదని, కనీసం స్వామినాథ సూచనల వెలుగులో C2+ 50% ధరలు ఇవ్వాలని భూమయ్య అన్నారు.

వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకలు, చాపల పెంపకం వంటి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహాలు తగ్గుతున్నాయని, వారందరికీ సబ్సిడీతో కూడిన రుణాలు అందించి ఆ రైతులను కూడా ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సుకు అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) రాష్ట్ర అధ్యక్షుడు వీ. కోటేశ్వరరావు మరియు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య హాజరవుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆగ్గు ఎర్రన్న, T. కృష్ణ గౌడ్, B. సాయిలు, సహాయ కార్యదర్శి అగ్ు చిన్నయ్య తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment