నేడు బీసీ బంద్‌ను విజయవంతం చేయండి – రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పిలుపు

నేడు బీసీ బంద్‌ను విజయవంతం చేయండి – రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పిలుపు

నేడు బీసీ బంద్‌ను విజయవంతం చేయండి – రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పిలుపు

 

  • అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ పిలుపు

  • 42% రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ పిలుపు మేరకు ఆందోళన

  • విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి



బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 18న బీసీ బంద్ జరుగనుంది. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కార్యదర్శి డా. ఈసవేని మనోజ్ యాదవ్ పిలుపు మేరకు, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల బీసీలు, సంఘాలు, విద్యార్థులు బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.



హైదరాబాద్/నిర్మల్ అక్టోబర్ 18: బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా మరియు ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి డా. ఈసవేని మనోజ్ యాదవ్ పిలుపునిచ్చారు.

రాజకీయాలకతీతంగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, అన్ని రంగాలవారు, ప్రతి బీసీ నాయకులు అధిక సంఖ్యలో బంద్‌లో పాల్గొనాలని ఆయన కోరారు.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సబ్బండ వర్గాలు కూడా బంద్‌లో పాల్గొని చరిత్ర సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని తెలిపారు.

రాష్ట్ర బంద్‌తో గల్లి నుంచి దిల్లీ వరకు సెగ పుడుతుందని, బీసీ రిజర్వేషన్ల పెంపుతో అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని డా. మనోజ్ యాదవ్ అన్నారు.

“బీసీలకు రిజర్వేషన్ వచ్చేంతవరకు ఈ ఉద్యమం ఆగదు. విద్యావంతులారా ముందుకు రండి. ప్రతి మండల కేంద్రంలో బంద్‌ను విజయవంతం చేయండి,” అని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment