ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని

: మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో
  1. క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక.
  2. ఝార్ఖండ్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
  3. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ధోని సహకారం.

: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్ల అవగాహన కోసం ధోని ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేయనున్నారు. తన ఫొటోను ప్రచారంలో వాడేందుకు కూడా ధోని అంగీకరించారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె. రవికుమార్ తెలిపారు.

: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడ్డారు. ప్రజలపై ఉన్న తన ప్రభావంతో ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు సమాజ సేవ బాధ్యతగా స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమంలో ధోని పాల్గొంటారని, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె. రవికుమార్ వెల్లడించారు.

ఈ నెలలో ఎన్నికల ప్రచారంలో ధోని తన ఫొటోను వాడేందుకు కూడా అంగీకరించారు. జనవరి 5తో ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుండగా, నవంబర్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి, పోలింగ్ కేంద్రాలను సక్రమంగా ఏర్పాటు చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment