మహాలయ పక్షము
———————————-
భాద్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని ‘పితృపక్షము’ అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున కలదు.
పురాణ గాథ
దాన శీలి గా పేరు పొందిన కర్ణుడికి మరణాంతరం స్వర్గం ప్రాప్తించింది. స్వర్గ లోకానికి వెళ్తుండగా మద్యలో ఆకలి ,దప్పిక కలిగాయి. ఇంతలో పక ఫలరుక్షం కనిపించింది ,పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యంగా అది కాస్త బంగారు ముద్దగా మారి పోయింది . ఆ చెట్టుకున్న పండే కాదు ఏ చెట్టుకున్న పండు ముట్టుకున్న అలాగే జరుగుతుంది . ఇలా లాబం లేదు అనుకోని దప్పిక అయిన తీర్చుకుందామని సెలయేటి సమిపించి దోసిట్లోకి నీటిని తీసుకోని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరు గ మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ అదే పరిస్థితి ఎదురయ్యింది . దాంతో కర్ణుడు తన చేసిన తప్పిదం ఏంటో ,తనకేందుకిల జరుగుంది అని వాపోతుండగా .. కర్ణా ! నీవు దానశీలి గ పేరు పొందవు.చెతికి ఎముక లేకుండా దానం చేసావు కాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆకాశవాని నుంచి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్య దేవుని వద్దకు వెళ్లి పరి పరి విదాలుగా ప్రదేయపడగా అయిన కోరిక మేరకు దేవరాజు అయిన ఇంద్రుడు కర్ణుడికి ఒక అవకాశం ఇచ్చాడు . నివు వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నర్తులందికి అన్నం పెట్టి ,మాత,పితురాలకు తర్పణలు వదిలి రమ్మన్నాడు . ఇంద్రుడి సూచనా మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు . అక్కడ పేదలకు ,బండుమిత్రులందరికి అన్న సంతర్పణ చేసాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు . ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణాలు చేసాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది . అందుకీ ఈ పక్షం రొజుఅలకు మహాలయ పక్షమని పేరు . మహాలయ పక్షం చివరి రోజును మహాలయ అమవస్యగా పిలుస్తారు .
పక్షము అనగా 15 రోజులకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
1. శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
2. కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
తిధి
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిధి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
పక్షంలోని తిథులు
1. పాడ్యమి (అధి దేవత – అగ్ని)
2. విదియ (అధి దేవత – బ్రహ్మ)
3. తదియ (అధి దేవత – గౌరి)
4. చవితి (అధి దేవత – వినాయకుడు)
5. పంచమి (అధి దేవత – సర్పము)
6. షష్టి (అధి దేవత – కుమార స్వామి)
7. సప్తమి (అధి దేవత – సూర్యుడు)
8. అష్టమి (అధి దేవత – శివుడు)
9. నవమి (అధి దేవత – దుర్గా దేవి)
10. దశమి (అధి దేవత – యముడు)
11. ఏకాదశి (అధి దేవత – శివుడు)
12. ద్వాదశి (అధి దేవత – విష్ణువు)
13. త్రయోదశి (అధి దేవత – మన్మధుడు)
14. చతుర్దశి (అధి దేవత – శివుడు)
15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత – చంద్రుడు)