నామినేషన్ ముందు పెద్దమ్మగుడి దర్శనం చేసిన మాగంటి సునీత గోపినాథ్
-
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ దాఖలు ముందు పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు
-
కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ వేయడానికి ముందు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆమెతో ఉన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (మనోరంజని ప్రతినిధి)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ వేయడానికి ముందు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులు తీసుకున్న అనంతరం మాగంటి సునీత నామినేషన్ ప్రక్రియ కోసం బయలుదేరారు. ఈ సందర్భంగా భక్తులు, పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.