ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా – నవంబర్ 15
సారంగాపూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయాలని జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మేడిసెమ్మే రాజు అన్నారు మండలంలోని కరుణాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం పార్టీ మండల క్రియాశీల కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్,ఎంపీటీసీ తో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైపల్యలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరిపే విలాస్ సీనియర్ నాయకులు మంతెన గంగారెడ్డి, సిందికర్ శ్రావణ్, చెన్న రాజేశ్వర్,మన్పూరి నారాయణ,సాహెబ్ రావు,సామల వీరయ్య,కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి,బ్యాగరి ఎల్లన్న, కరుణసాగర్ రెడ్డి,భూమా రెడ్డి, పథని నర్సయ్య, జీకే చాణక్య, తిరుమల చారి, బడి పోతన్న,రంజిత్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు