దుర్గామాత సేవలో ఆశన్నగారి మధుకర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 22
శరన్నవరాత్రి వేడుకల భాగంగా శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని శ్రీ నగర్ కాలనీ లోని శ్రీ దుర్గా మాత మండపంలో పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
దుర్గా మాత కమిటీ ఆహ్వానం మేరకు మండపానికి వచ్చిన ఆయన పూజలో సత్కరించి, తరువాత తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో చందూలాల్, శివ, సురేష్ బాబా, గానీ పికెపి, భారత్, వేణు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొని దుర్గామాత సేవలో పాల్గొన్నారు.
ఈ విధమైన పూజా కార్యక్రమాలు భక్తులను ఒకచోటకు చేరవేసి, సంప్రదాయాలను కాపాడటంలో, ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.