ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా వారిని బయటకు పంపిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ ఘటనపై భక్తులు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ, తక్షణ విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “భక్తుల మనోభావాలను హాని చేసే ఎటువంటి చర్యను కూడా తట్టుకోమని” లోకేశ్ తెలిపారు.