స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నేడే.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై హైకోర్టు విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో కోర్టు తీర్పుపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 23న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.