Local Body Elections: బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ..

Local Body Elections: బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ..

Local Body Elections: బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ..

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) వ్యవహారం సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది.

బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అంటూ వంగా గోపాల్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది. మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది.

ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ వైపు హైకోర్టులో మరో వైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9 విషయంలో హైకోర్టు, సుప్రింకోర్టులు ఏం చెప్పబోతున్నాయి? జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావహులు ఉత్కంఠతో ఉండగా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‍తో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది

Join WhatsApp

Join Now

Leave a Comment