భైంసాలో సాహిత్య సామ్రాట్ అన్నభావు సాటే వర్ధంతి
భైంసా మనోరంజని ప్రతినిధి జూలై 18
భైంసా పట్టణ కేంద్రంలో సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్న భావు సాటే విగ్రహము వద్ద మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ-క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తం భలేరావు, నాయకులు భీమ్ పవార్ కలసి అన్న భావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాబోయే ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలన్నారు. బడుగు బలహీన వర్గాల జాతి కోసం పోరాడిన వ్యక్తి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోడాపూర్ చంద్రభాన్, గణపతి, పూజారి లక్ష్మణ్, మొగలి దత్తు , దుర్పత్ బాయి, గాడేకర్ రాజు, వాగ్మరే బాలాజీ, మౌల గైక్వాడ్, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు