లయన్ మదన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
లయన్స్ క్లబ్ అఫ్ షాద్ నగర్ సేవా సంకల్ప్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణ గ్రేడ్ -1 గ్రంథాలయం చైర్మన్ & లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ లయన్ మదన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా క్లబ్ అధ్యక్షులు లయన్ రవికుమార్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సమక్షంలో కేకును కట్ చేసి అనంతరం మొక్కలు నాటినారు. తదుపరి రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులకు గొడుగులను అందచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు రామకృష్ణ రెడ్డి, లక్ష్మిపతి రెడ్డి, నర్సింహా రెడ్డి, హరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..