LHPS రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశం
M4 న్యూస్ (ప్రతినిధి),
హైదరాబాద్, అక్టోబర్ 23, 2024:
లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈ బుధవారం, అక్టోబర్ 23, 2024, మధ్యాహ్నం 2:00 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరుగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మూడవ రాంబాబు నాయక్ గారు అధ్యక్షత వహించనున్నారు.
LHPS జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లా మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని LHPS నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ మనవి చేశారు.