కేటీఆర్‌ను కలిసిన ముఖ్య నేతలు – లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ

కేటీఆర్‌ను కలిసిన ముఖ్య నేతలు – లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ

కేటీఆర్‌ను కలిసిన ముఖ్య నేతలు – లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ

మనోరంజని ప్రతినిధి, భైంసా – జూలై 6

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పలువురు ముఖ్య నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే స్థానిక సంస్థల (లోకల్ బాడీస్) ఎన్నికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ,

“లోకల్ బాడీ ఎన్నికలలో విజయం మనదే కావాలి. అందుకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కృషి చేయాలి,” అని నేతలను ఉద్దేశించి సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు దాదన్న గారి విట్టల్ రావు, దాఫెదార్ రాజు, టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతం, ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించే అంశాలపైనూ చర్చ జరిగినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment