అన్న బావు సాటే 105 వ జయంతి ఉత్సవాలు:సమాజ సేవకునికి ఘనంగా సన్మానించిన మాదిగ యువజన సంఘం:
కుబీర్ మండల కేంద్రంలో అన్న బావు సాటే 105 వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా,భాజా భజంత్రీల మధ్య మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల సమాజ సేవలో హైదరాబాదులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ సాప పండరికి మాదిగ యువజన సంఘం అధ్యక్షులు గోనేకర్ విట్టల్,సభ్యులు గోరేకర్ దేవ, వెన్నెల సతీష్, గోరేకర్ బాబు, భాస్కర్,లక్ష్మణ్,సాయినాథ్, భగవాన్,హేవన్, వడ్లూరి గంగాధర్, ఆనంద్,మాధు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సాహిత్య సామ్రాట్ అన్న బావు గారు శ్రామికుల కోసం, కార్మికుల కోసం చేసిన సేవలు అభినందనీయమని తెలిపారు.కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఉండే దత్త ప్రసాద్, సభ్యులు కస్తూరే పోశెట్టి,జంగ్మే దత్తాత్రి, చందనే విజయ్, ఉండే సునీల్, పలువురు నాయకులు, గ్రామస్తులు,మహిళలు పాల్గొన్నారు