లాఫ్టర్ యోగ (నవ్వు యోగ) ఒత్తిడిని తగ్గించే దివ్య ఔషధం
(నవ్వుదాం నవిధ్దాం నవ్వులను
పంచుదాం)
“నవ్వుకుండా ఒక రోజు ఉండం అంటే
ఆ రోజు వృధా అయినట్లే ” *చార్లీ చాప్లిన్
నవ్వవయ్యా బాబు నీ సొమ్మేం పోతుంది అని ఓ పాటుంది. అవును నవ్వితే మన సొమ్ము పోదుగా ఒక చిరునవ్వుతో యుద్ధాలెన్నో ఆపేయ్యచ్చు అని కవి అంటాడు .
నవ్వండి నవ్వించండి నవ్వుల పాలు కాకుండి. ‘నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం రోగం” అన్నాడో కవి. ప్రతి ఏటా మే మొదటి ఆదివారం రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటారు. భారత దేశంలో ముoబై నగరానికి చెందిన డాక్టర్ మధన్ కటారియా నవ్వుల దినోత్సవ సృష్టి కర్త.భారత దేశం ప్రపంచానికి యోగ ‘ఆయుర్వేదం మాత్రమే కాకుండా ప్రపంచానికి నవ్వుల దినోత్సవాన్ని అందించిన ఖ్యాతి దక్కడం గర్వకారణం. ఒక రోజు డాక్టర్ కటారియా ఉదయం వాకింగ్ కు వెళ్లి జనాన్ని పోగుచేసి జోకులు చెపుతూ 30 నిమిషాలు నవ్వించారు.1955 మార్చి 13 న లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేశాడు. ప్రపంచమంతటా నవ్వుల యోగ ఉద్యమం విస్తరించి 105 దేశాల్లో వేలాది లాఫ్టర్ క్లబ్బులు ఏర్పడ్డాయి.ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు ‘యోగ కేంద్రాలు నవ్వుల ఉద్యమాన్ని
నిర్వహిస్తూ ప్రపంచ మానవాళి మధ్య స్నేహం’ సౌభ్రాతృత్వం’ సౌహార్ధత శాంతి ‘చైతన్యం పెంపొందించడానికి నవ్వుల దినోత్సవాన్ని జరపడం గమనార్హం ..నవ్వు వల్ల వ్యక్తులు తమను తాము మార్చుకోవడానికి అప్రమత్తంగా ఉండడానికి ‘కోపాన్ని వదిలించుకోవడానికి త్వరగ క్షమించడానికి సహాయపడుతుంది. నవ్వు ప్రపంచంలో మానవాళి మధ్య మెరుగైన సంబంధాలు
శాంతి యుత సానుకూల దృక్పథం ఏర్పడడానికి శక్తి వoతమైన సాధనం . నవ్వు వ్యక్తి యొక్క ముఖ కవళికల మీద మానసిక భావోద్వేగాల పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశ్యం తో మధన్ కటారియా నవ్వుల ఉద్యమాన్ని ప్రారంభించాడు.
” ఎవరూ నవ్వుతూ చనిపోవడం నేను చూడలేదు కాని లక్షలాది మంది నవ్వక పోవడం వల్ల చనిపోతున్నారని నాకు తెలుసు ” “డాక్టర్ మధన్ కటారియా అన్న వాఖ్య లాఫ్టర్ యోగ( నవ్వు యోగ) పట్ల మేలుకొలుపు కావాలి.
నవ్వు మానవునికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. నవ్వు యోగ మానసిక ఆరోగ్య సంరక్షణకు ఆహ్లాదానికి స్వత సిద్ధ శక్తి .నవ్వు మానసిక ఆనందం కల్గించే సాధనం. నవ్వు శరీరానికి మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందించే ఒక ఏరోబిక్ వ్యాయామం వంటిది.లాఫ్టర్ యోగ (నవ్వు )యోగ భౌతిక మానసిక మరియు భావోద్వేగ ఒత్తిడి తగ్గించే వ్యాయామం.
నవ్వు ఒత్తిడి నిరాశ నిస్పృహల ను దూరం చేసి అహల్లాదానికి ఆనందానికి చేరువచేస్తుంది.
మనిషినీ ఆనందం ఆశ్చర్యం చుట్టు ముట్టినపుడు ఎక్కువగా నవ్వుతాడు .నవ్వు మానవుల ఆయుస్సును పెంచుతుందని వైద్య ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి.
లాఫ్టర్ యోగ (నవ్వు యోగ) ప్రయోజనాలు
లాఫ్టర్ యోగ (నవ్వు యోగ )ద్వారా అనేక ప్రయోజనాలు గలవు
నవ్వు మంచి మూడ్ కు సాధనం .మనిషి మూడ్ మీద జీవితం వ్యాపారం సామాజిక సంబంధాలు ఆధారపడి ఉంటాయి. మూడ్ మంచిగా వుంటే అన్ని విషయాల.మీద శ్రద్ధ ను కేంద్రీకరిస్తారు. అనుకున్న కార్యాలు సాధించి విజయం సాధిస్తారు.నవ్వడం వల్ల మెదడు కణాల నుండి ఎండార్ఫిన్ అనే నిర్దిష్ట రసాయనాలు రిలీజ్ అయ్యి మూడ్ మారటానికి తోడ్పడతాయి.
రోజంత హాయిగా హుషారుగ ఉల్లాసం ఉత్సాహం ఉప్పొంగి సంతోషంగా వుండి ఉత్పాదక శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి.
నవ్వు ఆరోగ్య ప్రయోజనాలు
నవ్వు యోగ తో ఆరోగ్యo సిద్ధిస్తుంది ఒత్తిడి తగ్గును ఏక కాలంలో భౌతిక మానసిక భావోద్వేగాలను ఒత్తడి ని తగ్గిస్తుంది.నవ్వితే కోపం భయం అసూయ ఆందోళన ద్వేషం ఒత్తిడి
మాయమైపోతుంది
నవ్వు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలవు
నవ్వు యోగ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యoగా జీవితాన్ని గడుపటానికి ఖర్చు లేని గొప్ప పెట్టుబడి నవ్వు .నవ్వితే రక్త ప్రసరణ సక్రమంగా పెరిగి ఊపిరి తిత్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. నవ్వు అధిక రక్త పోటు తగ్గించడానికి దివ్య ఔషధం.ప్రతి రోజూ 10 నుండి 15 నిమిషాలు నవ్వితే 40 కాలరీలు ఖర్చు అవుతాయి.
రక్త పోటు గుండె వ్యాధులు మధుమేహం రాకుండా నిరోధిస్తుంది నిరాశ’ ఆర్థరైటిస్ అలర్జీలు ‘ ఆస్తమా ‘బ్రాంకైటిస్ వెన్ను నొప్పి ‘తల నొప్పి ‘ఋతు సంబంధ లోపాలు ‘క్యాన్సర్ ఇతర వ్యాధులు నయం చేయటంలో నవ్వు గొప్ప ఆరోగ్య సాధనంగా ఉపయోగపడుతుంది.
నవ్వు గొప్ప ఔషధం .జెస్సీ డైలాన్ జీవితంలో ప్రేమ మరియు నవ్వును మేల్కొలిపినపుడు మనసులో భయం ఆందోళన దూరమవుతుంది.సంతోషమైన ఆత్మ మానవ అనుభవంలో ప్రతి అంశాన్ని వైద్యంగా నవ్వు గొప్ప ఔషధంగా మారుతుంది. _జెస్సీ డైలాన్
నవ్వు ఉత్తమ జీవన ప్రమాణ సాధనం నవ్వు. నవ్వడం వల్ల జ్ఞాపక శక్తి ‘సృజన శక్తి ‘పాజిటివ్ నెస్ ‘ప్రాణవాయువు సరఫరా పెరిగి మానసిక దృఢత్వం ఏర్పడుతుంది.
నవ్వు మెరుగైన సంబంధాలు
నవ్వడం వల్ల ఉత్తమ ప్రజా సంబంధాలు ఏర్పడతాయి. అభిమానులు పెరుగుతారు. బాధలు స్నేహితులతో షేర్ చేసుకొని ఆరోగ్యానికి కావలసిన కేర్ దొరుకుతుంది. నవ్వడం వల్ల మనుషుల మధ్య అడ్డుగోడలు తొలిగి పోతాయి నవ్వుఆనందానికి ఆందానికి సూచిక నవ్వు ప్రపంచ భాష నవ్వు ద్వారా విశ్వ శాంతిని పెంపొందించ వచ్చునని నవ్వుల దినోత్సవం తెలియ చేస్తుంది. నవ్వు వల్ల వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు సానుకూల దృక్పథo పెరుగుతుంది. అధిక నవ్వుతో అధిక స్నేహితులను సంపాదించుకోవచ్చు. నవ్వుతో స్నేహ సౌభాగ్యం మై వర్ధిల్లి సంతోష సంబరాలు వికసించి ఆయు: ప్రమాణం పెరుగు తుంది.
నవ్వు లాఫ్టర్ కామెడీ ఆత్మకు ఔషధం హియమ్ అబ్బాస్
నవ్వు అనేది దైనందిన జీవితంలో కలిగే భాధల వల్ల కలిగే ఒత్తిడిని.వదిలించుకోవడానికి ఒకమార్గం కామెడీ అనేది ఒక విధంగా మీ ఆత్మకు ఔషధం లాంటిది ” “హియమ్ అబ్బాస్”
ప్రతికూల పరిస్థితుల్లో ఆప్త బoధువు నవ్వు
మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సవాళ్లు ఎదుర్కోవడానికి నవ్వు సానుకూల దృక్పథం సృష్టించడానికి నవ్వు ఉపయోగ పడుతుంది. కష్ట కాలములో ఏర్పడే సమస్యల పరిష్కారానికి కావలసిన విశ్వాసాన్ని ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది.నాడు నవ్వడం నాలుగు విధాల. చేటు నేడు పలు విధాల.మేలు అని వైధ్య ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి.
నవ్వు ఒక యోగం నవ్వక పోవడం రోగం కరోనా మహమ్మారికి విరుగుడు మనోల్లాసానికి ప్రకృతి సిద్ధ ఔషధం నవ్వు అని నమ్మాం
నవ్వుల పంటలు లేని జీవితం నరకo తో సమానం.
ప్రపంచం _ నవ్వుల దినోత్సవం
నవ్వుల దినోత్సవం ప్రపంచ దేశాలలో విస్తరించింది .భారత దేశం వెలుపల జనవరి 9 వ తేదీన డెన్మార్క్ రాజధాని కోపెన్ హగ్గన్ లో 25 వేల మందినవ్వుల దినోత్సవానికి హాజరయ్యారు.
2004 మే 2వ తేదీ నాడు స్విజ్జర్లండ్ రాజదాని నగరములో నవ్వుల దినోత్సవం నిర్వహించారు ఆ దేశ పార్లమెంట్ చుట్టూ నవ్వుతూ ప్రధక్షణలు చేయడం చరిత్ర లో మరచిపోని సంఘటన. ప్రజలలో రాజకీయ నాయకులలో ఆరోగ్యకరమైన హాస్యం పట్ల అభిరుచి పెరిగితే ప్రజాస్వామ్యంలో తిట్ల తీవ్రత తగ్గి ఆరోగ్య కరమైన నిర్మాణాత్మక విమర్శలతో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమోతుందని నవ్వుల ఉద్యమ నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు.
పాఠ్యాంశంగా లాఫ్టర్ యోగ( నవ్వు యోగ)
పాటశాల కళాశాల స్థాయిలో నవ్వుల యోగ ను పాఠ్యాంశంగా
ప్రవేశ పెట్టి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించి ఆత్మ విశ్వాసాన్ని
పెంపొందించే విద్యా ప్రణాళికలు రూపొందించే కార్యాచరణకు ప్రభుత్వాలు పూనుకోవాలి.
నవ్వు జీవనశైలిలో భాగం కావాలి( నవ్వు సామాజిక ఉద్యమంగా కొనసాగాలి)
ప్రభుత్వం పౌరసమాజం ‘మహిళా యువజన ‘ స్వచ్ఛంద సంస్థలు
సామాజిక సేవా సంస్థలు ధార్మిక సంస్థలు ఎన్ ”ఎన్’ ఎస్ ఎన్’ సి’ సి
గ్రామాలలో అంగన్వాడీ కార్యకర్తలు పొదుపు సంఘాల
తల్లుల సంఘాలు’ కుటుంబాలు
నవ్వుల ఉద్యమo ముందుకు సాగడానికి ఉద్యుక్తులై నవ్వుల పువ్వుల పంటలు పండించి
నవ్వుతూ నవ్విస్తూ నవ్వులను పంచుతూ నవ్వులతో సంతోషకరమైన
జీవితానికి నాంది పలుకుదాం.దైనందిన జీవితంలో నవ్వును జీవన శైలిలో భాగం చేసుకొని ఒత్తిడిని ఓడిద్ధాం ఆరోగ్యకర ఆనంద భారత్ ను నిర్మిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771