నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హెడ్ పోస్టాఫీస్‌లో “ఇటీ 2.0” పోస్టల్ సాఫ్ట్‌వేర్ ప్రారంభం
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ జూలై 22
నగరంలోని హెడ్ పోస్టాఫీస్ (Head Post Office) వేదికగా అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీలో భాగంగా “ఇటీ 2.0” (IT 2.0) పేరుతో నూతన పోస్టల్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు ఎస్‌ఎస్‌పీవోఎస్ (SSPOs) జనార్దన్ రెడ్డి. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఏఎస్పీ సురేఖ, శ్రావణ్ (IPPJG), పోస్టుమాస్టర్ అజయ్ కుమార్, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్‌ఎస్‌పీవోఎస్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ –
“ప్రజలకు మెరుగైన, నాణ్యత మైన సేవలు అందించాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఇటీ 2.0 ద్వారా పోస్ట్ ఆఫీస్ సేవల్లో పారదర్శకత, వేగం, నాణ్యత మరింత పెరుగుతాయి. రాబోయే రోజుల్లో దీని ద్వారా ప్రజలకు మరింత మేలు కలుగుతుందని ఆశిస్తున్నాం.”
పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణను అందించినట్టు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో వారు ప్రజల పట్ల మరింత అంకితభావంతో, సహనంతో, మర్యాదతో సేవలందించగలగడం ద్వారా తపాలా శాఖ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.
“ప్రజలే మా శక్తి. ప్రజలతోనే మేము,” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మళ్లీ చాటిచెప్పిందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని తమ మద్దతును తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవల కోసం తపాలా శాఖ చేస్తున్న ఈ కొత్త నూతన ప్రయత్నం, డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో మరో ముందడుగుగా అభివర్ణించవచ్చు