లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

కార్మిక హక్కులను హరించే చట్టాలు — సీఐటీయూ ఆగ్రహం

కీసర మండలంలో నిరసన, కేంద్రంపై తీవ్ర విమర్శలు

మనోరంజని తెలుగు టైమ్స్ కీసర, నవంబర్ 22

కార్మికుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ మండల కమిటీ డిమాండ్ చేసింది. కీసర మండలంలోని నాగారం మున్సిపాలిటీ గోధుమకుంట వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ–మండల ప్రజాసంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ బంగారు నర్సింగరావు మాట్లాడుతూ—
దేశ కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తీవ్రంగా మండిపడ్డారు.

29 చట్టాల స్థానంలో 4 కోడ్‌లు… కార్మికులకు ద్రోహమే

నిరసనలో మాట్లాడుతూ సీఐటీయూ మండల కో–కన్వీనర్ చింతకింది అశోక్—
కార్మికుల హక్కులు, సంక్షేమం, భద్రతను తీవ్రంగా దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్‌లుగా మార్చటం దురుద్దేశపూరితమన్నారు. జాతీయ కార్మిక సంఘాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు చేసినా… కేంద్ర ప్రభుత్వం “దున్నపోతు మీద వాన పడ్డట్టుగా” స్పందించకుండా ఉందని విమర్శించారు.

నోటిఫికేషన్‌ను తక్షణం వెనక్కి తీసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రకటించిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేసి, ప్రస్తుత కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కట్ట జంగయ్య, పి.లలిత, లక్ష్మీనరసమ్మ, సురేందర్, మైసయ్య, సుశీల, మన్నెమ్మ, నీరజ, పుష్ప, బాలమ్మ, హనుమక్క, పెంటమ్మ, అశ్విని, అరుణ, భద్రయ్య, జాన్ మోషా, సురేష్, శ్రీకాంత్, ఐలయ్య, నిఖిల్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment