- బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ.
- 171 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 100 పరుగులు సాధించిన నితీష్.
- కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు.
తెలుగు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ సాధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. 21 ఏళ్ల నితీష్ తన తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీతో మేటి బ్యాటర్‌గా నిలిచాడు. నితీష్ విజయం పై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపిస్తూ, “ఇతను ప్యూచర్ కెప్టెన్” అంటూ ట్వీట్ చేశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాల్గో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో 171 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో తన కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసిన 21 ఏళ్ల నితీష్, టెస్ట్ క్రికెట్‌లో తన ప్రతిభను చాటుకున్నాడు. విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్ తర్వాత ఈ సిరీస్‌లో సెంచరీ సాధించిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
నితీష్ విజయంపై కేవలం క్రికెట్ ప్రముఖులు మాత్రమే కాకుండా, రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా నితీష్‌ను అభినందిస్తూ, “భారత క్రికెట్‌లో అతను ప్యూచర్ కెప్టెన్ అవుతాడనే నమ్మకం ఉంది” అని అన్నారు.