నిజామాబాద్‌లో వారాహి అమ్మవారి ఆలయానికి కోటప్పకొండ కృష్ణశిలలు
మనోరంజని ప్రతినిధి, నిజామాబాద్ – ఆగస్టు 16
నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో గల శ్రీ వారాహి అమ్మవారి ఆలయంకి కోటప్పకొండ నుంచి ప్రత్యేక కృష్ణశిలలు వచ్చాయి. ఈ శిలలతో గతంలో యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణం జరిగిన విషయం విశేషం. ఆలయ నిర్మాణంలో భాగంగా ఉపమండప నిర్మాణార్థం ఈ శిలలను ఇక్కడకు తేగలిగామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంచాల జ్ఞానేంద్ర మాట్లాడుతూ –
“ఈ కృష్ణశిలలకు ప్రత్యేక విశిష్టత ఉంది. వీటి ద్వారా భక్తులకు శాంతి, సౌఖ్యం, ఆనందం లభిస్తాయి. గతంలో యజ్ఞాలు, హవనాలు, దేవీ నవరాత్రులు విజయవంతంగా నిర్వహించాం. ఆదిలాబాద్, మంచిర్యాల వంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఒక భవ్యమైన శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నిర్మాణం చేపడుతున్నాం” అని తెలిపారు.
ఇక ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భం నాడు కృష్ణశిలలు చేరడం ఒక చమత్కారమని, అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. అనంతరం మంచాల జ్ఞానేంద్ర మరియు పశుపతి శర్మ ప్రత్యేక హారతులు సమర్పించారు.