చౌట్ పల్లి లో కోటి లింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ప్రారంభం*

చౌట్ పల్లి లో కోటి లింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ప్రారంభం*

మనోరంజనీ తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 25
చౌట్ పల్లి లో  కోటి లింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ప్రారంభం*

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాస పుణ్యకాలంలో భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
శనివారం తెల్లవారుజాము పుట్టచవితి సందర్బంగా భక్తులు బుట్టపూర్ణ బంగారాలను ఆలయానికి తీసుకువచ్చి,121 మంది శివదీక్ష స్వాములు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం అఖండ దీపారాధన, పుణ్యవాచనము, పంచసూక్త హోమం,రుద్ర హోమం గ్రామ పురోహితులు గంగా ప్రసాద్ ,భువన దీక్షితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
సాయంత్రం ఇంటీ దేవాలయం నుండి స్వామివారిని హంస వాహనంపై ఊరేగింపుగా గ్రామ వీధులలో తీర్ధయాత్రగా తీసుకువెళ్లి, చౌటుపల్లి గ్రామ శివారులోని కొండపై ఉన్న దేవస్థానానికి పల్లకిపై భక్తితో భక్తులు,హర హర మహాదేవ”నినాదాలతో ప్రాంతం అంతటా శివభక్తి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో మాల దారణ భక్తులు, మంగళ హరతులతో మహిళలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment