- నాగభూషణ విద్యాలయంలో కొమరం భీమ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు
- గిరిజనుల ఆరాధ్య దైవంగా కొమరం భీమ్ యొక్క పాత్రను ప్రశంసించారు
- విద్యార్థులకు కొమరం భీమ్ చేసిన సేవలపై అవగాహన కల్పించారు
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని నాగభూషణ విద్యాలయంలో మంగళవారం కొమరం భీమ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవంగా ఆయన పాత్రను గుర్తు చేసి, ఆయన చేసిన పోరాటాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని నాగభూషణ విద్యాలయంలో మంగళవారం కొమరం భీమ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, నాగభూషణ విద్యాలయ ప్రిన్సిపల్ బాబురావు కొమరం భీమ్ గిరిజనుల ఆరాధ్య దైవంగా, రజాకర్ల నుండి గిరిజనులను కాపాడిన అడవి ధృవతారగా, నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ప్రశంసించారు.
అల్లూరి సీతారామరాజు, బీర్సాముండా వంటి నాయకుల స్ఫూర్తితో కొమరం భీమ్ జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాటం చేసి, జోడేఘాట్ కేంద్రంగా ముందుకు సాగిన విషయం గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు కొమరం భీమ్ జాతికి చేసిన సేవలను వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యాసపురి కన్యకార పరమేశ్వరి ట్రస్టు ఇన్చార్జి సంతోష్ గాదేవార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సులోచన, ఉపాధ్యాయులు విమలత, వింధ్య, సంతోషి, శరత్, సందీప్, కిషన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.