కిసాన్ సంఘ నూతన మండల కమిటీ ఏర్పాటు.

కిసాన్ సంఘ నూతన మండల కమిటీ ఏర్పాటు.

కిసాన్ సంఘ నూతన మండల కమిటీ ఏర్పాటు.

మనోరంజని ప్రతినిధి తానూర్ ఆగస్టు 03

నిర్మల్ జిల్లా తానుర్ మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ నిర్మల్ జిల్లా కమిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబీర్ ఆనంద్ రావు,ఆధ్వర్యంలో నిర్వహించబడిన మండల రైతు సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ నూతన మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.మండల అధ్యక్షుడు
బాయి జగన్, ఉపాధ్యక్షుడిగా కంచర్ల రవీందర్ రెడ్డి, కార్యదర్శిగా పున్నోడు సాయినాథ్,సహ కార్యదర్శిగా బయ్యవాడ్ కిరణ్,కార్యవర్గ సభ్యులుగా ఆదివారం బాధ్యత తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబిర్ ఆనంద్ రావు, మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలోని రైతులకు కలుగుతున్న ప్రతి సమస్యపై పోరాటం చేయడం జరుగుతుందని, భారతీయ కిసాన్ సంఘ యొక్క ముఖ్య ఉద్దేశం రైతు శ్రేయస్సు, రైతులను సంఘటన చేయడమే అని ఆయన అన్నారు.ఈ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కమిటీ సభ్యులు,నిర్మల్ జిల్లా కమిటీ సభ్యులు, మండలం లోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment