రైతుల వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

రైతుల వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్


రైతుల వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

  • మోర్తాడ్ మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన నూతల శ్రీనివాస్ రెడ్డి

  • హమాలీలు లేక వడ్ల తూకం ఆలస్యం అవుతోందని రైతుల ఫిర్యాదు

  • తూకాల ప్రక్రియ వేగవంతం చేయాలని డిసిఓ, ఐకెపి అధికారులతో మాట్లాడిన నేత

  • తూకం పూర్తయిన వడ్లను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశం కోరారు

  • 48 గంటల్లో రబీ, ఖరీఫ్ బోనస్‌లు రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్


 

మోర్తాడ్ మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. హమాలీలు లేక వడ్ల తూకం ఆలస్యం అవుతోందని రైతులు తెలిపిన నేపథ్యంలో, ఆయన డిసిఓ మరియు ఐకెపి అధికారులతో మాట్లాడి తూకాలను వేగవంతం చేయాలని కోరారు. 48 గంటల్లో రబీ, ఖరీఫ్ బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.


 

మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. గత వారం రోజులుగా వడ్లు ఆరబెట్టడం జరిగినప్పటికీ, హమాలీలు లేక తూకాల ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో, నూతల శ్రీనివాస్ రెడ్డి డిసిఓ గారితో, ఐకెపి అధికారులతో మాట్లాడి వడ్ల తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తూకాలు వేసిన వడ్ల బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కోరారు.

అలాగే, రైతులు ఎదురుచూస్తున్న రబీ బోనస్‌తో పాటు ఈ ఖరీఫ్ బోనస్‌ను కూడా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గంగారెడ్డి, చిన్నారెడ్డి, మామిడి గంగారెడ్డి, చాపల్ రెడ్డి, మహిళా రైతులు మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment