మానవత్వం చాటుకున్న ఖానాపూర్ హిందూ ఉత్సవ సమితి

  • ఖానాపూర్ దసరా ఉత్సవాల్లో 2 తులాల బంగారు గొలుసు కోల్పోయిన వ్యక్తికి తిరిగి అందజేత
  • హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యుల మానవత్వం ప్రశంసనీయం
  • సోషల్ మీడియా ద్వారా వ్యక్తికి సమాచారం అందించడంతో సంఘటన పరిష్కారం

 

ఖానాపూర్ హిందూ ఉత్సవ సమితి సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. దసరా ఉత్సవాల్లో 2 తులాల బంగారు గొలుసు కోల్పోయిన వ్యక్తికి, కమిటీ సభ్యులు సురేష్, శ్యాం, లక్ష్మణ్, తదితరులు వాటిని తిరిగి అందించారు. సోష‌ల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న సమితి, బాధితునికి బంగారు గొలుసును అందజేసింది.

 

ఖానాపూర్ పట్టణంలో దసరా ఉత్సవాల సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్న సంఘటన వెలుగు చూసింది. శ్రీ రామనగర్‌కు చెందిన గుమ్ముల అశోక్ అనే వ్యక్తి 2 తులాల బంగారు గొలుసును కోల్పోయారు. ఖానాపూర్ హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ఉత్సవాలు ముగిసిన అనంతరం వారి వద్ద దొరికిన గొలుసును చూసి బాధితునికి వెతుకుతున్నారు.

సమాచారం తెలుసుకున్న అశోక్‌ సామాజిక మాధ్యమం ద్వారా ఉత్సవ సమితి సభ్యులకు సమాచారం అందించారు. సమితి అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి శెట్టి శ్యాం, తుమన్నపెల్లి లక్ష్మణ్, నిమ్మల సాయి ఆధ్వర్యంలో గొలుసును బాధితుడికి పెద్దల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా అల్లాడి వెంకటేశ్వర్లు, కరిపి శ్రీను, కరింగుల సుమన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సంఘటనకు సంబంధించి హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రదర్శించిన మానవత్వం ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Comment