రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కే ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం

రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కే ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం

రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కే ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

మంగళగిరి:
రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి
వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకే ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ… ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ రూపంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
బాలికల అపహరణలు, తప్పిపోవడాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఆగష్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ ను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం పూర్తి సమన్వయంతో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. కుటుంబాల నుండి దూరమైన బాలికలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించి, తిరిగి వారిని వారి వారి కుటుంబాల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ట్రేస్ లక్ష్యం” అని డీజీపీ తెలిపారు. తప్పిపోయిన బాలికల కేసులకు సంబంధించి ఉపయోగిస్తున్న మిషన్ వాత్సల్య పోర్టల్, ఫేషియల్ రికగ్నైజేషన్, ట్రాన్స్ పోర్ట్ హబ్స్, షెల్టర్స్, బోర్డర్ చెక్ పోస్టులతో పాటు ఎన్.జీ.ఓ ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించడంతో పాటు సమస్యాత్మక ప్రదేశాలలో మహిళా పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.కాపాడిన బాలికలను వారి కుటుంబాలతో కలిపి వారికి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరితగతిన వారికి మెడికల్ కేర్, ఆహారం, వసతి, దుస్తులతో పాటు అవసరమైన న్యాయ సలహాలను ఏర్పాటు చేసి వయస్సు నిర్ధారణ పరీక్షలు, గుర్తింపుకు సంబంధించిన పత్రాలను రూపొందించడంతో పాటు వారిపై ఆకృత్యాలు జరిగితే కేసు నమోదు చేయించడం జరుగుతుందన్నారు. ఎన్.జీ.ఓ ల ద్వారా కౌన్సిలర్స్ ని నియమించి బాధిత బాలికలకు మానసిక సంబంధమైన సమస్యలకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక వారికి చదువు, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ తో పాటు ప్రభుత్వ వెల్ఫేర్ స్కీంలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమానికి సంబంధించి ఆగస్టు ఒకటి, రెండవ తేదీల్లో డేటా కలెక్షన్ కై జిల్లా, సబ్- డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేయడం, 3వ తేదీ నుంచి, 10వ తేదీ వరకు ఎన్.జీ.ఓ లు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత ఎఫ్ఐఆర్ లను రీ వెరిఫికేషన్ చేయడం, అందులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఫేస్ రికగ్నైజేషన్, డీఎన్ఏ పరీక్ష, ఆధార్ ద్వారా వయస్సుకు సంబంధించిన సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు.
ఆగష్టు నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో, ప్రార్ధనా స్థలాలతో పాటు రెడ్ లైట్ ఏరియాల్లో ప్రత్యేక తనిఖీల ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఫైండ్ హియర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
శక్తి యాప్ లో రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ అనే ఫీచర్ ద్వారా తప్పిపోయిన పిల్లల కోసం ఫిర్యాదు చేయవచ్చునని, ఆపద సమయంలో సహాయం కోసం ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించి సహాయం చేయగలరన్నారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని 112 నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా లేదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు గానీ, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181కు గానీ, శక్తి వాట్స్ యాప్ నెంబర్ 7993485111కు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో ప్రతి పోలీసు యూనిట్ లో మహిళల రక్షణకై శక్తి టీమ్ లు పని చేస్తున్నాయని, ఈ బహిరంగ ప్రదేశాలలో ఈవ్ టీజింగ్ చేసే ఆకతాయిల భరతంపడుతున్నాయన్నారు. ప్రతి జిల్లా యూనిట్ కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒన్ స్టాప్ సెంటర్ లు బాధిత మహిళలకు, బాలికలకు అన్ని విధాలుగా సహాయం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ ఆవరణలోని తరగతి గదుల నుంచి ఐదుగురు బాలికలను శక్తి వారియర్స్ గ్రూప్ గా ఏర్పాటు చేసి, వారికి శక్తి టీమ్స్ ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి వివరించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి బాలికలకు తెలియజేయటం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా యూనిట్లలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతగా ఆపరేషన్ ట్రేస్ ను పోలీసు స్టేషన్ల ద్వారా నిర్వహించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏడీజీపీ ఎన్. మధుసూదన రెడ్డి, ఇంచార్జ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ బి. రాజకుమారి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ ఎన్. శ్రీదేవిరావు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment