ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్న కేసీఆర్!
తెలంగాణ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రత్యక్ష పోరాటానికి ఆయన రెడీ అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆవశ్యకతను వివరించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం BRS నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ ఆగస్టు 6న ధర్నా చేపట్టనుంది. ఆ తర్వాత కేసీఆర్ కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి